మంచి రెస్క్యూ ప్లాన్ చెబితే 20 వేల డాలర్ల ప్రైజ్.. నాసా ప్రకటన
- అనుకోని కారణాలతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోతున్న వ్యోమగాములు
- వారిని క్షేమంగా భూమికి తీసుకు వచ్చేందుకు మెరుగైన ప్లాన్ కోసం పోటీ ఏర్పాటు
- జనవరి 23 లోపు ప్లాన్ వివరాలు పంపించాలంటూ నాసా సూచన
ఆన్ లైన్ లో ఈ పోటీలో పాల్గొని మెరుగైన ప్లాన్ చెప్పిన వారికి 20 వేల డాలర్ల బహుమతి ఇస్తామని ప్రకటించింది. మన రూపాయల్లో సుమారు 17 లక్షలు గెల్చుకోవచ్చు. ఒక్క నాసా తరఫునే 20 వేల డాలర్లు కాగా ఇతరత్రా సంస్థల తరఫున ప్రకటించిన మొత్తం కూడా కలుపుకుంటే అన్నీ కలిపి 45 వేల డాలర్లు.. అంటే మన రూపాయల్లో 38 లక్షల పైమాటే. ఏ దేశ పౌరులు అయినా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆన్ లైన్ లోనే తగిన ప్లాన్ వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. జనవరి 23 వరకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి, అత్యుత్తమ ప్లాన్ చెప్పిన వారికి బహుమతి అందజేస్తామని నాసా ప్రకటించింది.