అక్కినేని ఇంట పెళ్లి సందడి... ఆ కారు శోభిత కోసమే కొన్నారా?
- ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతన్య-శోభితల వివాహం
- ఈ పెళ్లికి హాజరు కానున్న సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు
- ఇటీవల రూ. 2 కోట్లు పెట్టి టయోటా లెక్సస్ కారును కొనుగోలు చేసిన నాగ్
- ఈ కారును శోభితకు గిఫ్ట్‌గా ఇవ్వడానికే తీసుకున్నారని టాక్
ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక చైతన్య-శోభితల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. సుమారు ఏడెనిమిది గంటల పాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారట.
ఇదిలాఉంటే.. ఈ పెళ్లి సందర్భంగా ఇంటికి రాబోయే కోడలికి నాగార్జున ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నారని కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నాగ్ రూ. 2 కోట్లు పెట్టి టయోటా లెక్సస్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనిని శోభితకు గిఫ్ట్‌గా ఇవ్వడానికే తీసుకున్నారని టాక్ నడుస్తోంది.