అమ్మ కోరిక నెరవేర్చేందుకు.. అమరావతి కోసం రూ.1 కోటి విరాళం ఇచ్చిన మహిళ
- రూ.1 కోటి విరాళం ఇచ్చిన గుంటూరు జిల్లా మహిళ విజయలక్ష్మి
- హైదరాబాద్లో స్థలాన్ని విక్రయించి డొనేషన్
- సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
తన మాతృమూర్తి కోగంటి ఇందిరాదేవి కోరిక నెరవేర్చేందుకు అమరావతి నిర్మాణానికి ఈ భారీ విరాళం ఇచ్చినట్టు విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్లో తమకు ఉన్న కొద్ది స్థలాన్ని విక్రయించి ఈ డబ్బును విరాళంగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములం కావాలనే సంకల్పించామని తెలిపారు. కాగా భారీ సాయం చేసిన విజయలక్ష్మిని సీఎం చంద్రబాబు అభినందించారు. విజయలక్ష్మి సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రశంసించారు. గొప్పత్యాగం చేశారంటూ మెచ్చుకున్నారు.