తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి సింధియాను తీసుకువెళ్లిన భద్రతా సిబ్బంది
- కేంద్ర మంత్రి పర్యటనను డ్రోన్ ద్వారా వీడియో చిత్రీకరణ చేస్తుండగా కదిలిన తేనెతుట్టె
- తేనె టీగల దాడిలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలు
అయితే కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వీడియో చిత్రీకరణకు డ్రోన్లను వినియోగించారు. ఈ క్రమంలో తేనెతుట్టె కదిలింది. వెంటనే తేనెటీగలు అక్కడ ఉన్న వారిపై దాడి చేశాయి. భద్రతా సిబ్బంది కేంద్ర మంత్రికి వలయంగా ఏర్పడి ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే తేనె టీగల దాడిలో కొత్వాలీ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.