లివర్ ను సహజంగా క్లీన్ చేసే ఆహారం ఇదే!

30-11-2024 Sat 08:13 | Health
Advertisement
  • మారిన జీవన శైలితో కాలేయంపై పెరుగుతున్న ఒత్తిడి
  • దాని పనితీరు దెబ్బతింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు
  • కొన్ని రకాల ఆహారంతో లివర్‌ పునరుత్తేజం చెందుతుందంటున్న ఆరోగ్య నిపుణులు
Advertisement
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్‌) ఒకటి. రక్తంలోని విష పదార్థాలు, వ్యర్థాలను తొలగించడంతోపాటు... మనం తినే ఆహారం సరిగా జీర్ణం కావడానికి కాలేయమే కీలకం. కానీ మన ఆహార అలవాట్లలో మార్పులు, ఆల్కహాల్‌ వినియోగం, జీవన శైలిలో మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతోంది. ఫ్యాటీ లివర్‌ వంటి సమస్యలు వస్తున్నాయి. 

అయితే కాలేయానికి తనంతట తాను మరమ్మతు చేసుకునే శక్తి ఉంటుందని... ఇందుకోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాన్ని మన రోజువారీ డైట్‌ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ ఆహార పదార్థాలు ఏవంటే...

వెల్లుల్లి... 
దీనిలో సల్ఫర్‌ ఆధారిత రసాయన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపేందుకు కాలేయం ఉత్పత్తి చేసే ఎంజైముల తయారీలో ఆ రసాయన సమ్మేళనాలు తోడ్పడుతాయి. ఇక వెల్లుల్లిలోని అల్లిసిన్‌, సెలీనియం రెండూ కూడా కాలేయాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బీట్‌ రూట్‌...
వీటిలోని బెటాలైన్స్‌ గా పిలిచే రసాయన సమ్మేళనాలు కాలేయం ఇన్‌ ఫ్లమేషన్‌ ను తగ్గిస్తాయని... విష పదార్థాలను బయటికి పంపడంలో తోడుగా నిలుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ బీట్‌ రూట్‌ రసం తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.

గ్రీన్ టీ... 
గ్రీన్‌ టీలో కెటచిన్స్‌ గా పిలిచే రసాయన సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అవి కాలేయం పనితీరును మెరుగుపర్చి, వ్యాధులు రాకుండా చూస్తాయి. తరచూ గ్రీన్‌ టీ తీసుకుంటే... లివర్‌ ఎంజైమ్‌ ను నియంత్రించి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఆకుకూరలు, కూరగాయలు...
ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయల్లో అధికంగా ఉండే క్లోరోఫిల్‌... లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలోని భార ఖనిజాలు, రసాయనాలు, పురుగు మందుల అవశేషాలను తొలగించడంలో లివర్‌ కు సాయపడుతుంది.

ఆలివ్‌ ఆయిల్‌... 
ఆలివ్‌ ఆయిల్‌ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు... శరీరంలో కొన్నిరకాల విష పదార్థాలను శోషించుకుంటాయి. తద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎక్స్‌ ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం వల్ల లాభం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వాల్‌ నట్స్‌..
వీటిలో అర్జినైన్‌ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. అది శరీరంలో ఉత్పన్నమయ్యే అమ్మోనియాను తొలగించడంలో కాలేయానికి సాయపడుతుంది. ఇక వాల్‌ నట్స్‌ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, గ్లుటాథియాన్‌ వంటివి కాలేయం పనితీరును మెరుగుపర్చి వ్యాధులు రాకుండా చూస్తాయి. 

  • ఇక పసుపులోని కర్క్యుమిన్‌ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తూ.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది.
  • నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లలో అధికంగా ఉండే ‘విటమిన్‌ సీ’ తోనూ శరీరంలో విష పదార్థాలు తొలగిపోయి... కాలేయం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
  • యాపిల్స్‌ లో ఉండే పెక్టిన్‌ అనే ఫైబర్‌ శరీరంలో విష పదార్థాలను తొలగించి, కాలేయానికి తోడ్పడుతుంది.
Advertisement
LiverfoodHealthoffbeatscienceViral News

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more