Revanth Reddy: ఆ వీడియోపై స్పందించిన రేవంత్ రెడ్డి... రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్

Revanth Reddy praises Allu Arjun for video on drugs
షార్ట్స్‌లో చూడండి
డ్రగ్స్ నిర్మూలన కోసం నటుడు అల్లు అర్జున్ వీడియో చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఆ వీడియోను చేయడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేశారని... ఇది ఆనందించదగ్గ విషయమని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి ట్వీట్‌కు అల్లు అర్జున్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌ను, తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు.

కాగా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఇటీవల ఓ వీడియో తీశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని అల్లు అర్జున్ ఆ వీడియోలో సూచించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు బాధితులను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారని, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలబడదామంటూ వీడియో తీశారు. ఈ వీడియో నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
Go Back to Shorts
Revanth Reddy
Allu Arjun
Drugs
Telangana

More Telugu News