'పుష్ప-2' నుంచి 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో రిలీజ్
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప-2: ది రూల్'
- డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
- 'పీలింగ్స్' సాంగ్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రోమో ద్వారా ప్రకటించిన మేకర్స్
- అన్ని భాషల్లోనూ మలయాళంలోనే ఉండనున్న ఈ సాంగ్ పల్లవి లిరిక్స్
ఇలా ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి ఒకో సాంగ్ ఒక దాన్ని మించి మరొకటి హిట్ కాగా రీసెంట్ గా అయితే ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మలయాళ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన ఆ పాటనే 'పీలింగ్స్'. అన్ని భాషల్లోనూ ఈ సాంగ్ పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి.
దీంతో పక్కా మలయాళ బీట్స్ లో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ పాట అక్కడే ఓ రేంజ్‌లో జనానికి ఎక్కేసింది. దాంతో ఈ పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఇపుడు సాలిడ్ ప్రోమోతో విడుదల తేదీ వచ్చేసింది.
ఈ మోస్ట్ అవైటెడ్ సాంగ్‌ను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి. ఇంకెందుకు ఆలస్యం... ఈ పాట ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.