Jagan: రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయి: జగన్

AP going in reverse says Jagan
షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదని అన్నారు. వైసీపీ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని... ప్రతి ఇంటికి మంచి చేశామని తెలిపారు. కూటమి పాలనలో ఆ ప్రగతి వెనక్కి వెళుతోందని చెప్పారు. రాష్ట్రం తిరోగమనంలో ఉందని... రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేకాట క్లబ్ లు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. లిక్కర్, ఇసుక స్కామ్ లు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలని ప్రతి అడుగు వేశామని చెప్పారు. వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేశామని తెలిపారు. 

రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా... ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారని జగన్ చెప్పారు. వైసీపీ హయాంలో సంపద సృష్టి జరిగిందని తెలిపారు. మూడు పోర్టుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు. ఆ పోర్టుల నిర్మాణం పూర్తి కావచ్చిందని... వీటి వల్ల ఆదాయం పెరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.   
Go Back to Shorts
Jagan
YSRCP

More Telugu News