Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళలు టార్గెట్.. పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు రైల్వే సీరియల్ కిల్లర్‌ను తీసుకొచ్చిన పోలీసులు

Train serial killer arrested in Gujarat
Advertisement
  • 35 రైళ్లలో పలు హత్యలు చేసి, దోపిడీకి పాల్పడిన నిందితుడు కరమ్ వీర్
  • ఒంటరి మహిళలు కనిపిస్తే హత్య చేసి దోపిడీ
  • మోస్ట్ వాంటెడ్ కిల్లర్‌ను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు
  • పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చిన జీఆర్పీ పోలీసులు
Advertisement
35 రైళ్లలో పలు హత్యలు చేసి దోపిడీకి పాల్పడిన సీరియల్ కిల్లర్ కరమ్ వీర్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయగా, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు పీటీ వారెంట్‌పై అతనిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నిందితుడు కరమ్ వీర్‌ రైల్వే స్టేషన్‌నే స్థావరంగా ఏర్పరుచుకున్నాడు. ఒంటరిగా మహిళలు ఎవరైనా కనిపిస్తే హత్య చేసి దోపిడీ చేయడం అతని నైజం. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ కిల్లర్‌ను గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌కు ఎందుకు తీసుకువచ్చారంటే...

ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ రైల్లోని వికలాంగుల పెట్టెలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ హత్య తానే చేసినట్లు నిందితుడు కరమ్‌ వీర్‌ ఒప్పుకున్నాడు. సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్‌ పోలీసులు సమాచారం అందించారు. దీంతో పీటీ వారెంట్‌పై కరమ్‌ వీర్‌ను హైదరాబాద్‌కి తీసుకొచ్చారు.

నిందితుడు కరమ్ వీర్ ఒకచోట హత్య చేసి... దోపిడీకి పాల్పడ్డాక తన స్థావరాన్ని మరోచోటికి మార్చుతాడని వల్సాద్ ఎస్పీ వెల్లడించారు. రైల్వే స్టేషన్ల వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దోపిడీ చేసి హత్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. 35 రైళ్లలో... ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేసినట్లు చెప్పారు. కరమ్ వీర్ హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. రాజస్థాన్, యూపీ, హర్యానా రాష్ట్రాలలో పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఇప్పుడు రైల్వే సీరియల్ కిల్లర్‌గా మారిపోయాడన్నారు.
Advertisement
Advertisement
Hyderabad
Indian Railways

More Telugu News