ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
- మోదీని కలిసిన వారిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
- మోదీతో కాసేపు ముచ్చటించిన ప్రజాప్రతినిధులు
- రాజాసింగ్ భుజం తట్టిన ప్రధాని మోదీ
ప్రధానిని కలిసిన వారిలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు. మోదీ ఈ సందర్భంగా రాజాసింగ్‌ను తన దగ్గరకు పిలిచి భుజం తట్టారు.


