'నేవా'లోకి ఏపీ శాసన వ్యవస్థ
- కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం
- కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ శాసనసభ సభాపతి, ఉప సభావతి, కౌన్సిల్ చైర్మన్లు
- అప్లికేషన్ అమలు ప్రారంభమైతే సభా కార్యకలాపాలు అన్నీ ఇక డిజిటల్‌గానే..
పార్లమెంట్‌తో పాటు దేశంలోని 31 శాసనసభలు, 6 శాసనమండళ్లను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నేవాను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు కూడా ట్యాబ్‌లు అందిస్తారు. అప్లికేషన్ అమలు ప్రారంభమైతే సభా కార్యకలాపాలు అన్నీ డిజిటల్‌గా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ యాప్‌లో ప్రతి సభ్యుడికీ ప్రత్యేక డ్యాష్ బోర్డు ఉంటుంది. అందులో సభలో తన కార్యకలాపాలను చూసుకునే వీలు ఉంటుంది.