నరసాపురం 'లేస్'కు భౌగోళిక సూచిక గుర్తింపు

26-11-2024 Tue 08:22 | Andhra
Advertisement
  • కేంద్ర మంత్రి నుంచి సంయిక్తంగా ధ్రువీకరణ అందుకున్న రేఖారాణి, నాగరాణి
  • స్థిరమైన మార్కెట్ అనుసంధానాన్ని అందించడానికి ఈ గుర్తింపు ఉపకరిస్తుందన్న రేఖారాణి
  • ధ్రువీకరణ అందుకోవటం సంతోషంగా ఉందన్న కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ నాగరాణి
Advertisement
నరసాపురం ‘లేస్’కు భౌగోళిక సూచిక (జి.ఐ) ధ్రువీకరణ అందుకోవటం సంతోషంగా ఉందని రాష్ట్ర్ర చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భౌగోళిక సూచితో అంతర్జాతీయ   గుర్తింపు సాధించినట్లు అయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా వీరిరువురు సంయుక్తంగా భౌగోళిక సూచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. 
 
కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజి,  బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా జౌళి ఉత్పత్తులపై అంతర్జాతీయ స్ధాయి వర్క్‌ షాప్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖారాణి మాట్లాడుతూ దేశీయ జౌళి పరిశ్రమలో అంతర్ భాగంగా చేతితో నేసిన, తయారు చేసిన వస్త్రాలు భౌగోళిక సూచిక నమోదిత ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్నాయన్నారు. జి.ఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో వేలాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామని వివరించారు. స్థిరమైన మార్కెట్ అనుసంధానాన్ని అందించడానికి ఈ గుర్తింపు ఉపకరిస్తుందన్నారు. 
 
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జౌళి చేతి ఉత్పత్తుల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లేసుకు జి.ఐ గుర్తింపు లభించటంలో కార్మికులు, ఉత్పత్తి దారులు ఎగుమతి దారుల నిరంతర కృషి దాగి ఉందని కలెక్టర్ నాగరాణి వివరించారు. నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర జౌళి శాఖ నుండి జి.ఐ సర్టిఫికేట్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు, రాష్ట్రంలో జి.ఐ గుర్తింపు పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా నిలవడానికి కారణమైన వారందరికీ ఈ గుర్తింపు మరింత భరోసాను ఇస్తుందన్నారు. 
 
వర్క్ షాపులో భాగంగా భౌగోళిక సూచి రావటానికి ముందు, తరువాత అన్న అంశాలపై లోతైన చర్చ సాగిందని, ఫలితంగా ఈ ఉత్పత్తుల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే దిశగా అడుగులు పడ్డాయన్నారు. కార్యక్రమంలో హస్త కళల ఎగుమతుల ప్రోత్సాహక సంస్ధ నుండి అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ కన్వీనర్ కె.ఎన్ తులసీ రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ఎగుమతిదారులు, వాటి సంస్థలు, నమోదిత యజమానులు, జి.ఐ యొక్క అధీకృత వినియోగదారులు, ఈపీసీల ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి.
.
Advertisement
narasapuram lace parkgeographical identification

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more