యూఎస్ బుకింగ్స్‌లో 'పుష్ప-2' అరుదైన ఘ‌న‌త‌.. విడుద‌ల‌కు ముందే రికార్డుల మోత‌!

New Record Created by Pushpa2 with Pre Bookings in USA
  • అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో 'పుష్ప‌-2'
  • డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న మూవీ
  • 1.25 మిలియన్ డాలర్ల‌ గ్రాస్ మార్క్‌ను ట‌చ్ చేసి ఫాస్టెస్ట్ బుకింగ్స్ రికార్డు నెల‌కొల్పిన వైనం
  • సుమారు 45 వేలకి పైగా టికెట్ల విక్ర‌యం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌స్తున్న 'పుష్ప‌-2'పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పుష్ప‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ ఓ రేంజ్‌లో ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. డిసెంబ‌ర్ 5న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానుంది. దీంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ముమ్మ‌రం చేశారు. 

ఇక‌ యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో తాజాగా ఈ మూవీ ఓ అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం అక్కడ ఏకంగా 1.25 మిలియన్ డాలర్ల‌ గ్రాస్ మార్క్‌ను ట‌చ్ చేసి ఫాస్టెస్ట్ బుకింగ్స్ రికార్డును త‌న‌ ఖాతాలో వేసుకుంది. సుమారు 45 వేలకి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకున్నారు. దాంతో బ‌న్నీ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పుష్ప గాడి రూల్ ప్రారంభ‌మైంద‌ని కామెంట్లు పెడుతున్నారు. 
Advertisement
Pushpa2
Allu Arjun
Pre Bookings
USA
Tollywood

More Telugu News