పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై ముప్పేట దాడి
- ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్న వ్యక్తులు పార్లమెంట్, రాజ్యాంగాలను అవమానిస్తున్నారన్న మోదీ
- గూండాయిజం ద్వారా సభలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఓటమిని ఉద్దేశించి మోదీ విమర్శలు
- పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ
‘‘ప్రజలు దాదాపు 80-90 సార్లు తిరస్కరించివారు పార్లమెంటులో చర్చలు జరగనివ్వడం లేదు. మన రాజ్యాంగంలో పార్లమెంటు, మన ఎంపీలు ఎంతో ముఖ్యం. పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలి. ఎక్కువ మంది ఎంపీలు చర్చలకు సహకారం అందించాలి. పలు విశేషాలతో ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా ప్రత్యేకమైనవి. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరం ప్రారంభమవనుండడం అందులో ఒకటి’’ అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సెషన్‌లో వక్ఫ్ సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లులు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, రైల్వే చట్టం సవరణ బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టే సూచనలు ఉన్నాయి.