ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రేణిగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించాడు.

బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే మృతి చెందిన యువకుడి వివరాలు మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు. 


More Telugu News