పంజాబ్ ఉపఎన్నికల ఫలితాలు.. నిరాశలో బీజేపీ
- పంజాబ్ లో నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు
- మూడు స్థానాల్లో లీడ్ లో ఉన్న ఆప్
- అన్ని స్థానాల్లో వెనుకబడిన బీజేపీ
చబ్బేవాల్, గిద్దర్బహ, బర్నాలా, డేరా బాబా నానక్ నాలుగు స్థానాల్లో కూడా బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నాలుగు స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు... ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో, ఈ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. నవంబర్ 20న ఈ స్థానాల్లో పోలింగ్ జరిగింది.