వరుసగా రెండో రోజూ పతనమైన అదానీ గ్రూప్ షేర్లు
- అమెరికా అభియోగాలతో నిన్న ఒక్క రోజే అదానీ గ్రూప్ విలువ రూ. 2.2 లక్షల కోట్లు పతనం
- నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం
- ఇంత ఒత్తిడిలోనూ ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు
ఈ నేపథ్యంలో అదానీ కంపెనీ షేర్ల పతనం నేడు కూడా కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నాలుగు శాతం క్షీణించాయి. గతేడాది మే తర్వాత ఈ షేర్లు పతనం కావడం ఇదే తొలిసారి. అలాగే, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్‌మార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 3 నుంచి 10 శాతం పతనమయ్యాయి. మరోవైపు, ఏసీసీ సిమెంట్స్ షేర్లు 0.5 శాతం క్షీణించాయి. మరోవైపు, మార్కెట్లో ఇంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ అదానీకే చెందిన అంబుజా సిమెంట్స్‌తోపాటు ఎన్డీటీవీ షేర్లు ఒక్కోటి ఒక శాతం పెరగడం గమనార్హం.