రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు.. వలస వచ్చారు: డీకే అరుణ
- నియోజకవర్గ ప్రజలపై రేవంత్ కక్ష కట్టారన్న అరుణ
- లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదని... వారు వలస వచ్చారని డీకే అరుణ చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని ప్రజలు గెలిపిస్తే... ఆయనేమో జనాలపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంతాలకు పోవద్దని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని సూచించారు.
పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని... 11 నెలల సమయంలోనే మీరు పేదల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అహంకారాన్ని వీడాలని చెప్పారు. రైతులను ఒప్పించిన తర్వాతే భూములు తీసుకోవాలని అన్నారు.