కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు.. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
- ఢిల్లీలో ఖట్టర్‌ను కలిశానన్న కేటీఆర్ వ్యాఖ్యలు అవాస్తవమన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- ఢిల్లీలో ఆయనకు బీజేపీ నేతలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న ఎంపీ
- ఖట్టర్ ఆఫీస్ పీఏతో తాను మాట్లాడాకే ఈ విషయం చెబుతున్నానన్న బీజేపీ నేత
ఢిల్లీలో కేటీఆర్ ఒక్క బీజేపీ నాయకుడిని కూడా కలవలేదని కొండా పేర్కొన్నారు. ఎవరూ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఖట్టర్ ఆఫీస్ పీఏతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాలు చెబుతున్నానని చెప్పారు. ఢిల్లీలో కేటీఆర్ కలిసింది కాంగ్రెస్ నాయకులనేనని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఉన్నప్పటికీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అడ్డుకుంటోందని విశ్వేశ్వర్‌రెడ్డి వివరించారు.