Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలో కుదుపులకు ఎగిరిపడ్డ ప్రయాణికులు.. వీడియో ఇదిగో!

Passengers Fly Off Their Seats As Miami Bound Flight Faces Severe Turbulence
Advertisement
  • టర్బ్ లెన్స్ కారణంగా విపరీతమైన కుదుపులు
  • సీట్లలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. చెల్లాచెదురుగా కిందపడ్డ వస్తువులు
  • చచ్చిపోతామని భయపడ్డానన్న ప్యాసింజర్
  • వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పిన పైలట్
Advertisement
సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. కొందరైతే ఏకంగా పైకప్పుకు గుద్దుకున్నారు. చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్ లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. స్వీడన్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్న విమాన ప్రయాణికులకు ఈ భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీ లో దిగాల్సి ఉండగా.. మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. ప్రయాణికులు సీట్లలో ఎగిరిపడడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్ లో దింపేశాడు. ఆపై ప్రయాణికులకు రాత్రి వసతి కల్పించి, తెల్లవారి మరో విమానంలో మయామికి పంపించారు.
Advertisement
Advertisement
Turbulence
Flight
Passengers
Miami
Viral Videos
Offbeat

More Telugu News