బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల ఆగ్రహం
- ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం
- రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
- రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని స్పష్టీకరణ
సన్న ధాన్యంకు రూ.500 బోనస్ ఇస్తామని పునరుద్ఘాటించారు. రైతుల మీద బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కేంద్రాల నుంచి సన్న ధాన్యం సేకరించిన వారం రోజుల్లో బోనస్ చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. రైతులపై బీజేపీకి ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు.