అన్నంతపనీ చేసిన దళితనేత
తనను పార్టీ నుంచి ఎందుకు తొలగించారో టీఆర్ఎస్ అధినేత వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న దళితనేత చింతా స్వామి చెప్పిందే చేశారు. తన ప్రశ్నకు బదులివ్వకపోతే కేసీఆర్ ఇంటిముందు చావుడప్పు కొడతానని హెచ్చరించిన స్వామి అన్నంత పనీ చేశారు. అయితే, ఇందులో కొద్దిమార్పు చోటు చేసుకుంది. తొలుత అనుకున్నట్టుగా కేసీఆర్ ఇంటి ముందు కాకుండా.. తెలంగాణ భవన్ ఎదుట చావుడప్పు కొట్టారు చింతా స్వామి. ఇటీవలే తనను అకారణంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించారని స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
దళితుణ్ణయినందునే తన పట్ల వివక్ష ప్ర్రదర్శించారని ఆయన ఆరోపించారు. దళితులు ఉద్యమాన్ని తమ భుజాలపై మోస్తుంటే కేసీఆర్ రాజకీయ చదరంగం ఆడుతున్నారని స్వామి విమర్శించారు. కాగా, తెలంగాణ భవన్ ఎదుట నిరసన తెలిపిన స్వామికి దళిత సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్తత నెలకొన్నా.. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.