మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
- రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారని మండిపాటు
- రైతుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులతో గొడవలకు ప్రయత్నం
- తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి విధ్వంసకర వ్యూహాలు
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై ఇటీవల లగచర్ల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి బీఆర్ఎస్ నాయకుల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ దాడి వెనక మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డి బయటపెట్టారని పోలీసులు తెలిపారు.