Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్ఐ తల పగలకొట్టిన గంజాయి బ్యాచ్.. హైదరాబాద్ లో ఘటన

Ganja Seller Attack On Police In Habib Nagar
Advertisement
  • అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడి
  • బీర్ బాటిల్ తో కొట్టిన పాత నేరస్తుడు
  • ఆసుపత్రిలో చేరిన హబీబ్ నగర్ ఎస్ఐ శివకుమార్
Advertisement
గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి జరిగింది. స్థానికులతో కలిసి గంజాయి బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి అమ్మకాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో నార్కోటిక్ అధికారులు హబీబ్ నగర్ లోని మాంగర్ బస్తీకి వెళ్లారు.

సీఐలు దీపక్, రాజశేఖర్, ఎస్ఐ శివకుమార్ తో పాటు కొంతమంది కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు. అయితే, వీరి రాకను గుర్తించిన పాత నేరస్తుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటపడి దీపక్ ను పట్టుకున్నారు. స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులతో కలిసి దీపక్ తమ్ముడు అరుణ్ పోలీసులను అడ్డుకున్నాడు.

దాదాపు వంద మంది పోలీసులపై దాడికి దిగారు. బీర్ బాటిల్ తో కొట్టడంతో ఎస్ఐ శివకుమార్ తలపై గాయమైంది. స్థానికుల దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు.. ఎస్ఐ శివకుమార్ ను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో ఎస్ఐ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు పోయిందని పోలీసులు తెలిపారు. గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్, అతడి తమ్ముడు పరారయ్యారని వివరించారు.
Advertisement
Advertisement
Ganja
Smuglers
Attack on Police
SI Injured
Habib Nagar
Hyderabad

More Telugu News