పేటెంట్ల నమోదులో భారత్ దూకుడు... వరల్డ్ టాప్-6లోకి ఎంట్రీ
- వినూత్న ఆవిష్కరణలపై మేధో హక్కులు కోరుతూ దరఖాస్తులు
- 2023లో భారత్ లో 64,480 దరఖాస్తులు దాఖలు
- ఈ జాబితాలో చైనా నెంబర్ వన్
భారత్ మొదటిసారిగా మేధోపరమైన హక్కుల దరఖాస్తుల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించింది. డబ్ల్యూఐపీవో నివేదిక ప్రకారం... దీనికి సంబంధించి అత్యధిక దరఖాస్తులతో చైనా అగ్రస్థానంలో ఉంది. 2023లో చైనాలో 10 లక్షల 64 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి.
ఈ జాబితాలో చైనా తర్వాత అమెరికా (5.18 లక్షలు), జపాన్ (4.14 లక్షలు), దక్షిణ కొరియా (2.87 లక్షలు), జర్మనీ (1.33 లక్షలు) టాప్-5లో ఉన్నాయి. ఇక భారత్... 64,480 పేటెంట్ దరఖాస్తులతో 6వ స్థానంలో నిలిచింది.