Ramayanam: రామాయ‌ణంపై అద్భుత‌మైన యాడ్‌... సింప్లీ సూప‌ర్బ్ అంతే... ఇదిగో వీడియో!

Srilanka Airlines Releases an Extrodinary Advertisement on Ramayanam
షార్ట్స్‌లో చూడండి
పొరుగు దేశం శ్రీలంక‌కు చెందిన ఓ విమాన‌యాన సంస్థ రామాయ‌ణంపై రూపొందించిన ఓ అద్భుత‌మైన ప్ర‌చార చిత్రం (యాడ్‌) ఇప్పుడు నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. శ్రీలంక‌లోని రామాయ‌ణ ఇతిహాసంతో సంబంధం ఉన్న అన్ని ప్ర‌దేశాల‌కు ప‌ర్యాట‌కుల‌ను తీసుకెళ్లేందుకు ఒక స‌ర్వీస్‌ను శ్రీలంక‌న్ ఎయిర్‌లైన్స్ ఇటీవ‌ల ప్రారంభించింది. 'ద‌ రామాయ‌ణ ట్రెయిల్స్' పేరిట ప్రారంభించిన ఈ స‌ర్వీస్‌ను ప్రమోట్ చేయ‌డానికి ఎయిర్‌లైన్స్ ఓ మంచి ప్ర‌చార చిత్రాన్ని రూపొందించింది. 

ఆ యాడ్‌లో ఓ పెద్దావిడ త‌న మ‌న‌వ‌డికి రామాయ‌ణాన్ని బొమ్మ‌ల రూపంలో వివ‌రించ‌డం మ‌నం చూడొచ్చు. ఆ స‌మ‌యంలో శ్రీలంక‌లోని రామాయ‌ణంతో సంబంధం ఉన్న ప్రాంతాల‌ను చూపించారు. అలాగే రామ‌సేతువును కూడా చూపించ‌డం జ‌రిగింది. క‌నుల‌విందుగా 5 నిమిషాల నిడివితో ఈ ప్ర‌చార చిత్రాన్ని చిత్రీక‌రించారు. 

ఈ ప్ర‌స్తుతం ఈ యాడ్ తాలూకు వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు శ్రీలంక‌ విమాన‌యాన సంస్థ‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 
Go Back to Shorts
Ramayanam
Srilanka Airlines
Advertisement

More Telugu News