Pushpa-2: పుష్ప-2 ట్రైలర్ విడుదల బీహార్ గడ్డపై... అల్లు అర్జున్ అనౌన్స్ మెంట్

Allu Arjun announced Pushpa 2 trailer will be released in Patna on Nov 17
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ హీరోలు తమ పరిధిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ టీజర్ ను యూపీ రాజధాని లక్నోలో విడుదల చేయగా... ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఉత్తరాదిపై కన్నేశారు. పుష్ప-2 ట్రైలర్ ను బీహార్ గడ్డపై విడుదల చేయాలని నిర్ణయించారు. 

పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ ను నవంబరు 17న పాట్నాలో  విడుదల చేస్తున్నామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది. 

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప-2 మూవీ... తొలి పార్టును మించిపోయేలా ఉంటుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. దానికి తగ్గట్టే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పుష్పరాజ్ బజ్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. 

ఇప్పుడు బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేయడం ద్వారా మేకర్స్ తమ పంథాను స్పష్టం చేశారు. ఆలిండియా లెవెల్లో ఓపెనింగ్స్ కొల్లగొట్టాలన్నదే వారి ఉద్దేశమని అర్థమవుతోంది. అందుకే పుష్ప-2 చిత్రాన్ని ఉత్తరాది ఆడియన్స్ కు మరింత చేరువ చేసేలా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 

కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయిక కాగా... తొలిపార్టులో చివర్లో వచ్చి అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్... సెకండ్ పార్టులో ఫుల్ టైమ్ ఊపేయనున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

పుష్ప చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2లో ఐటమ్ సాంగ్ ను శ్రీలీలపై తెరకెక్కిస్తున్నారు. 'కిస్సిక్' అంటూ సాగే ఈ సాంగ్ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Go Back to Shorts
Pushpa-2
Trailer
Allu Arjun
Patna
Bihar
Sukumar

More Telugu News