రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్

Andhrapradesh Minister Payyavula keshav Budget speech
  • ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందంటూ గత ప్రభుత్వంపై విమర్శలు
  • రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
  • ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమం కేంద్రంగా కేటాయింపులు
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాబోయే పాతికేళ్ల ఆదాయాన్ని తగ్గించిందని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.

వార్షిక బడ్జెట్‌ రూ. 2,94,427.25 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు
ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లు

బడ్జెట్ లో కేటాయింపులు ఇలా..

  • ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు
  • జల వనరులు రూ.16,705 కోట్లు
  • పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి రూ.11,490 కోట్లు
  • రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు
  • పోలీసు శాఖ రూ.8,495 కోట్లు
  • ఇంధన రంగం రూ.8,207 కోట్లు
  • గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు
  • ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.322 కోట్లు
  • పాఠశాల విద్య - రూ.29,909 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ.11,855 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం - రూ.18,497 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ.39,007కోట్లు
  • మైనార్టీల సంక్షేమం - రూ.4,376 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం - రూ.4,285 కోట్లు
  • మానవ వనరుల అభివృద్ధి - రూ.1,215 కోట్లు
  • పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ.687 కోట్లు
Advertisement
AP Budget
AP Assembly Sessions
Payyavula Keshav

More Telugu News