ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో పెద్ద పులి కలకలం
- గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై దాడి చేసిన పెద్దపులి
- సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ అధికారులు
- శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని గామాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు
కాశిబుగ్గ రేంజ్ ఫారెస్టు ఆధికారి ఏ మురళీకృష్ణ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని పలు గ్రామాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా రాత్రి సమయంలో గ్రామస్తులు ఎవరూ పొలాలకు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు.