జూబ్లీహిల్స్‌లోని ‘తెలంగాణ స్పైస్ కిచెన్’ హోటల్లో భారీ పేలుడు
- పెద్ద శబ్దంతో పేలిన హోటల్లోని ఫ్రిజ్ కంప్రెషర్
- రాళ్లు ఎగిరిపడి దుర్గాభవానీ నగర్ బస్తీలోని నాలుగు గుడిసెలు ధ్వంసం
- రాళ్లు తగిలి ఓ మహిళకు గాయాలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.