హైడ్రా నోటీసులు అంటూ ప్రచారం... కమిషనర్ రంగనాథ్ స్పందన
- హైదరాబాద్ లో హైడ్రా నోటీసుల కలకలం
- ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్న అధికారుల బృందం
- తప్పుడు ప్రచారం అంటూ ఖండించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. పదిహేను రోజుల గడువు అంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో కలకలం రేగింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. భూమి అమ్మకంపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తమ సర్వే బృందం విచారణ చేపట్టిందని అంతే కానీ ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని వివరణ ఇచ్చారు.