తినడానికి ఫుడ్డులేని పరిస్థితిని చూశాను: యాంకర్ సౌమ్యారావు
- 'జబర్దస్త్' స్టేజ్ పై మెరిసిన సౌమ్యారావు
- తల్లిని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్
- ఆ కష్టాలు ఎవరికీ రాకూడదని ఆవేదన
- ఇకపై సీరియల్స్ కూడా చేస్తానని వెల్లడి
"మా అమ్మగారికి బ్రెయిన్ కేన్సర్ వచ్చింది. ఆ సమయంలో ఆమె కోసం చాలా డబ్బు కావలసి వచ్చింది. ఆ డబ్బు సర్దుబాటు చేయడానికి కూడా ఎన్నో అవస్థలు పడవలసి వచ్చింది. ఆ రోజులను... ఆ కష్టాలను ఎప్పటికీ మరచిపోలేము. అప్పటి నుంచి అమ్మ ఎప్పుడు గుర్తొచ్చినా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఆమెను ఎంతో మంచిగా చూసుకోవాలని అనుకున్నాను.
'జబర్దస్త్' అగ్రిమెంట్ ప్రకారం ఏడాది పాటు యాంకర్ గా చేశాను. ఆ తరువాత మానేయడం జరిగింది. నేను అక్కడ ఉన్నంతవరకూ ఎలాంటి లోటు లేకుండా నన్ను బాగా చూసుకున్నారు. టీమ్ లీడర్స్ తో పాటు, ఎవరితోనూ ఎలాంటి గొడవలు ఉండేవి కాదు. ఒకప్పుడు సీరియల్స్ లో అవకాశాలు వచ్చినా చేయలేదు. కానీ ఇకపై నాకు నచ్చినవి వస్తే చేయాలనే అనుకుంటున్నాను" అని అన్నారు.