చెరువు కబ్జా నోటీసుల వెనక రాజకీయం.. మండిపడ్డ కేతిరెడ్డి
- హైకోర్టులో కేసు విచారణలో ఉందని వెల్లడి
- కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేస్తానని వివరించిన మాజీ ఎమ్మెల్యే
- ప్రభుత్వం మారిన నాటి నుంచి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
నోటీసులు ఎందుకు పంపారంటే..
శ్రీసత్యసాయి జిల్లాలోని చిక్కవడియార్ చెరువును కేతిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని అధికారులు ఆరోపించారు. చెరువుకు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. ఈ భూములు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఉన్నాయని చెప్పారు. దీంతో ఆక్రమించిన భూమిని ఏడు రోజుల్లోగా ఖాళీ చేయాలని, లేదంటే అక్కడున్న నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అధికారులు నోటీసులు జారీ చేశారు.