రాహుల్ గాంధీకి వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య లేఖ
- జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పుతాడన్న ముశాల్ హుస్సేన్ ముల్లిక్
- యాసిన్ మాలిక్ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కోరిన ముశాల్
- యాసిన్ మాలిక్‌కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి
తన భర్త జైల్లో ఉన్నాడని, ఆయన అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కోరింది. జమ్ము కశ్మీర్‌లో ఆయన శాంతిని నెలకొల్పుతాడని పేర్కొంది. రాహుల్ గాంధీ గారూ... జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి యాసిన్ మాలిక్ ఒక శక్తిగా మారవచ్చని... అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, అందుకే ఆయన విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. తన భర్తను జైల్లో హింసకు గురి చేస్తున్నట్లుగా ఉందని, అతనికి న్యాయం జరిగేలా చూడాలని రాహుల్ గాంధీని కోరింది.