Appala Naidu: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పలనాయుడు పేరును ప్రకటించిన జగన్

Jagan announces Appala Naidu name as MLC candidate
షార్ట్స్‌లో చూడండి
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేరును వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. విజయనగరం జిల్లా పార్టీ నేతలతో జగన్ ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే అప్పలనాయుడు పేరును ప్రకటించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ఈసారి వెలమ సామాజికవర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ నేతలు బలపరిచినందున ఆయన పేరు ఖరారు చేశామని చెప్పారు. 

అప్పలనాయుడు సీనియర్ నాయకుడని, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని జగన్ అన్నారు. సమష్టి కృషితో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని... ఇప్పుడు అదే స్ఫూర్తితో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని నేతలకు సూచించారు. 

అప్పలనాయుడు నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ప్రొటెం స్పీకర్ గా పనిచేశారు.
Go Back to Shorts
Appala Naidu
Jagan
YSRCP

More Telugu News