అమీర్ ఖాన్ కంట కన్నీరు
బాలీవుడ్ తార జియాఖాన్ మరణం పట్ల హీరో అమీర్ ఖాన్ కంట తడిపెట్టారు. జియా ఆత్మశాంతి కోసం నిన్న రాత్రి ముంబయిలోని విలేపార్లే మెడికల్ క్లబ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. దీపికా పదుకొనే, రణ్ బీర్ కపూర్, సంజయ్ కపూర్, నగ్మా, ఊర్వశి డోలాకియా, ప్రతీక్ బబ్బర్ లు జియాఖాన్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.