Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock markets in profits
Advertisement
  • అమెరికా ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా ట్రంప్
  • దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫుల్ జోష్
  • మరోసారి 80 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారు కావడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 723 పాయింట్ల లాభంతో 80,211 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 209 పాయింట్లు పుంజుకుని 24,422కి చేరుకుంది. 

ఐటీ, టెక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్ 3.88 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.82 శాతం, టెక్ మహీంద్రా 3.77 శాతం, ఇన్ఫోసిస్ 3.77 శాతం లాభపడ్డాయి.

Advertisement
Advertisement
Stock Market
Sensex
Nifty

More Telugu News