AP Home Minister: పవన్ బయటపడ్డారు.. మేం పడలేదు అంతే..!: ఏపీ హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేరాల విషయంలో అందరమూ బాధపడుతున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ బయటపడ్డారు.. మేం పడలేదు.. అంతే తేడా అని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో క్లారిటీగా మాట్లాడానని, సోమవారం పవన్ మాట్లాడిన మాటలను పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈమేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపామన్నారు. 

శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్‌ జరగడం బాధాకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అనిత చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లుంది.. గత ప్రభుత్వ హయాంలోనూ పోలీసులు ఇబ్బంది పడ్డ విషయం మాత్రం గుర్తులేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.
AP Home Minister
Pawan Kalyan
AP Dy Cm
Anitha
TDP

More Telugu News