ఎడారి నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం!

  • ఇటీవలే రిటెన్షన్ జాబితాలు ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
  • పెద్ద సంఖ్యలో ఆటగాళ్ల విడుదల
  • నవంబరు చివరి వారంలో ఐపీఎల్ వేలం!
ఐపీఎల్-2025 సీజన్ కోసం ఆటగాళ్ల మెగా వేలం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలు ప్రకటించడం, పలువురు స్టార్ ఆటగాళ్లను జట్ల నుంచి రిలీజ్ చేయడం వంటి పరిణామాలతో... ఈసారి వేలం ప్రక్రియ మహా రంజుగా సాగనుంది. 

కాగా, ఐపీఎల్ మెగావేలం-2025 ఈ ఏడాది డిసెంబరులో ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐపీఎల్ వేలం ఈ నెలాఖరులో జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ ఈ వేలం కార్యక్రమానికి ఆతిథ్యమివ్వనుందని తెలుస్తోంది. వేదిక, తేదీ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

IPL 2025
Riyadh
Players Auction
BCCI

More Telugu News