బంగ్లాదేశ్ లో 30 వేల మంది హిందువుల ర్యాలీ.. కారణం ఇదే
- మైనారిటీలపై దాడులను అరికట్టాలని డిమాండ్
- ఛాటోగ్రామ్ నగరంలో రోడ్డెక్కిన హిందువులు
- హింస నుంచి తమను రక్షించాలంటూ ప్రభుత్వానికి వినతి
ప్రజల్లో వ్యతిరేకత, విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొని, ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు యూనస్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారని అక్కడి సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు సద్దుమణిగాయి. అయితే, దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై దాడులు పెరిగాయి. గత ఆగస్టు నుంచి వేలాది మంది హిందువులపై దాడులు, దోపిడీ ఇతరత్రా అకృత్యాలు జరిగాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల హిందువులు ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు.