Pushpa2: పుష్ప-2లో ఐటెమ్‌సాంగ్‌కు ఆ హీరోయిన్‌ కన్‌ఫర్మ్‌!

The heroine confirmed for the item song in Pushpa2

  • పుష్ప-2లో అల్లు అర్జున్‌తో నర్తించనున్న శ్రీలీల 
  • త్వరలో ఐటెమ్‌సాంగ్‌ చిత్రీకరణ 
  • దేవి శ్రీ ప్రసాద్‌ మాస్‌ బాణీలకు చంద్రబోస్‌ సాహిత్యం

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్‌ క్రేజీయస్ట్‌ ఫిలిం 'పుష్ప-2 ది రూల్‌'. ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్ప ది రైజ్‌' సంచలన విజయం సాధించడమే ఇందుకు కారణం. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటనకు, తగ్గెదేలే అనే ఆయన మేనరిజంకు అందరూ ఫిదా అయిపోయారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోన్న 'పుష్ప ది రూల్‌' చిత్రం ఈ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 

కాగా 'పుష్ప ది రైజ్‌' చిత్రంలో అల్లు అర్జున్‌-సమంతల మీద తెరకెక్కించిన ఊ... అంటావా... మామా ఊఊ అంటావా మామా అనే ఐటెమ్‌సాంగ్‌ ఎంతటి పాప్యులర్‌ అయ్యిందో అందరికి తెలిసిందే. సాధారణంగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించే ప్రతి సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా పుష్ప-2 ది రూల్‌లో ఓ ఐటెమ్‌సాంగ్‌ ఉంది. అయితే ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో నర్తించబోయే హీరోయిన్‌ ఎవరనే విషయంపై గత కొంత కాలంగా చాలా పేర్లు వినిపించాయి. 

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం పుష్ప-2 ది రూల్‌లో ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్‌తో కలిసి నర్తించేందుకు శ్రీలీల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే అల్లు అర్జున్‌, శ్రీలీలపై ఈ ఐటెమ్‌సాంగ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక డ్యాన్స్‌ల విషయంలో హీరో అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయనకు తోడుగా డ్యాన్స్‌ల విషయంలో ఓ స్పెషల్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కథానాయిక శ్రీలీల కాంబోలో ఓ సాంగ్‌ ఉంటుందంటే ఆ సాంగ్‌ ఎంతటి ఎనర్జీతో వుంటుందో ఊహించుకోవచ్చు. దేవి శ్రీ ప్రసాద్‌ తనదైన శైలిలో మాస్‌ బాణీలను సమాకూర్చగా, చంద్రబోస్‌ ఈ ఐటెమ్‌సాంగ్‌కు సాహిత్యం అందిస్తున్నాడు.

Pushpa2
Pushpa-2
Pushpa the rule
Allu Arjun
Sukumar
Sri leela
Sri leela latest news
Rashmika Mandanna
  • Loading...

More Telugu News