బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించిన ట్రంప్
- బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలను దోచుకుంటున్నారన్న ట్రంప్
- కమల, బైడెన్ హిందువులను పట్టించుకోవడం లేదని విమర్శ
- అమెరికాను మళ్లీ బలోపేతం చేస్తానని హామీ
బంగ్లాదేశ్లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ వారిని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో అలా జరగదని, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా హారిస్, జో బైడెన్ విస్మరించారని విమర్శించారు. వారు ఇజ్రాయెల్ నుంచి ఉక్రెయిన్, మన దక్షిణ సరిహద్దు వరకు విపత్తు కలిగించారని, కానీ తాము అమెరికాను మళ్లీ బలోపేతం చేస్తామని, తిరిగి శాంతి నెలకొల్పుతామని ట్రంప్ ఆ పోస్టులో పేర్కొన్నారు.