'దీపం-2' పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

30-10-2024 Wed 15:30 | Andhra
Advertisement
  • దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం
  • మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేసిన సీఎం చంద్రబాబు
  • నిన్నటి నుంచి అమల్లోకి దీపం -2 పథకం
  • 1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
Advertisement
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఏడాదికి 3 ఉచిత‌ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. 

బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అంద‌జేశారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయ్యే రూ. 2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. 

రూ.2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ, మొదటి విడతకు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. ఏడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు కల్పించింది. 

గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ. 25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రతియేటా రూ. 2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
AP GovtDeepam 2 SchemeFree Gas SchemeAndhra PradeshChandrababu

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more