Advertisement

జూబ్లిహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతలో మార్పు

Security Reinforcements at Telangana CM Residence
  • బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో మార్పు
  • సీఎం ఇంటి వద్ద బెటాలియన్ పోలీసులను తప్పించిన సీఎం సెక్యూరిటీ వింగ్
  • వారి స్థానంలో ఆర్మ్ డ్  రిజర్వ్ సిబ్బందితో భద్రత
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతలో మార్పులు చేశారు. తెలంగాణలో కొన్ని రోజులుగా బెటాలియన్ పోలీసులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంటి వద్ద బెటాలియన్ పోలీసులను తప్పించారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద బందోబస్తులో బెటాలియన్ పోలీస్ సిబ్బంది కూడా ఉంది. అయితే, సీఎం సెక్యూరిటీ వింగ్ తాజాగా వారిని తప్పించింది.

వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బందితో భద్రతను కల్పించింది. ముఖ్యమంత్రి ఇంటికి మూడు వైపులా ఉన్న 22 మంది టీజీఎస్‌పీ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ మార్చింది. వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బందికి సీఎం భద్రతా విధులు అప్పగించింది.
Advertisement
Revanth Reddy
Congress
Telangana
Hyderabad

More Telugu News