రాజకీయాల్లో రాక్షస క్రీడలు మానేయండి: కేటీఆర్
- దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా అంటూ కేటీఆర్ ఫైర్
- రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదంటూ ప్రశ్న
- రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు
రాజకీయాల్లో రాక్షస క్రీడలు ఆపేసి రైతులను ఆదుకోవడంపై దృష్టి సారించండి అని కేటీఆర్ హితవు పలికారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా... ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు రావడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.