నాలుగు నెలల క్రితం మిస్సయిన యూపీ మహిళ.. కాన్పూరులోని మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో మృతదేహం

UP Woman Went Missing 4 Months Ago Found Dead In Kanpur
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • ఈ ఏడాది జూన్ 24న అదృశ్యమైన మహిళ
  • పెళ్లి విషయంలో వాగ్వివాదం జరగడంతో ఆమెను కొట్టి చంపిన జిమ్ ట్రైనర్
నాలుగు నెలల క్రితం అదృశ్యమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త భార్య మృతదేహం తాజాగా కాన్పూరు జిల్లాలోని మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో లభ్యమైంది. ఈ కేసులో కాన్పూరులోని రాయ్‌పుర్వా ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించడంతో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను తానే చంపి పూడ్చిపెట్టానని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. 

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ ఈ ఏడాది జూన్ 24న అదృశ్యమైంది. జిమ్ ట్రైనర్‌కు పెళ్లి నిశ్చయమైనట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె అతడిని కలిసేందుకు జిమ్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి విషయమై వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు ఆమె మెడ వెనక బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టేశాడు.

అతడు ఆ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేసును ఛేదించడం కష్టమైందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలను పూణె, ఆగ్రా, పంజాబ్ పంపారు. కాగా, ఆ సమయంలో బాధిత మహిళ ధరించిన ఆభరణాలను నిందితుడు తీసుకున్నదీ, లేనిదీ నిర్ధరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Crime News
Uttar Pradesh
Kanpur
National News

More Telugu News