Crime News: అప్పుల్లో కూరుకుపోయి... హైదరాబాద్‌లో ఏపీకి చెందిన టెక్కీ ఆత్మహత్య

Tanuku techie commits suicide
షార్ట్స్‌లో చూడండి
అప్పుల్లో కూరుకుపోయిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోని కోకాపేటలో గురువారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని తణుకుకు చెందిన 27 ఏళ్ల నాగప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో ఉంటూ కోకాపేటలో ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అతను కొంతకాలంగా అప్పులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నిన్న కోకాపేటలోని హాస్టల్ భవనం 7వ అంతస్తు పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇతను ఈ హాస్టల్ భవనానికి ఎందుకు వచ్చాడో తెలియరాలేదు. నాగప్రభాకర్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం సికింద్రాబాద్‌లో ఉంటున్న సోదరికి తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Crime News
Tech-News
Andhra Pradesh
Telangana

More Telugu News