గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో... చికెన్ బిర్యానీలో కప్ప!
- బిర్యానీలో కప్ప రావడంతో అవాక్కయిన విద్యార్థులు
- మెస్ ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
- సిబ్బంది నిర్లక్ష్యమేనంటూ ఆగ్రహం
బిర్యానీలో కప్ప రావడం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని, అందుకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
కాగా, విద్యార్థులు చికెన్ బిర్యానీలో కప్ప అంశంపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.