రంకెలేస్తున్న స్పెయిన్ 'బుల్'
క్లే కోర్టు మొనగాడు రఫెల్ నడాల్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ లో మరో టైటిల్ కోసం ఉరకలేస్తున్నాడు. ఈ సాయంత్రం జరగనున్న టైటిల్ సమరంలో ఈ స్పెయిన్ బుల్ తన దేశానికే చెందిన డేవిడ్ ఫెర్రర్ తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ టోర్నీలో నడాల్ మూడోసీడ్ గా బరిలో దిగగా.. ఫెర్రర్ నాలుగో సీడింగ్ దక్కించుకున్నాడు. సెమీస్ లో నడాల్.. సెర్బ్ వీరుడు, వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ ను మట్టికరిపించగా, ఫెర్రర్.. లోకల్ హీరో జో విల్ఫ్రెడ్ సోంగాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక నడాల్ గనుక టైటిల్ గెలిస్తే మట్టికోటలో విజేతగా నిలవడం ఎనిమిదోసారి అవుతుంది. కాగా, ఫెర్రర్ ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.