Rahul Sipligunj: నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj about sharing of Rajinikanth pic
షార్ట్స్‌లో చూడండి
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటతో ఎంతో మంది అభిమానులను రాహుల్ సిప్లిగంజ్ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ గా కూడా ఆయనకు చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ... తాను చేసిన ఒక తప్పును బయటపెట్టారు. 

తాను రజనీకాంత్ కు వీరాభిమానినని రాహుల్ తెలిపారు. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని... తన ఇష్టాన్ని గుర్తించి, ఆ మూవీ లుక్ లోనే ఆయన తనతో ఫొటో దిగారని చెప్పారు. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ ను ఇంకా రిలీజ్ చేయలేదని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఫొటోను షేర్ చేయవద్దని రజనీకాంత్ తనకు చెప్పారని తెలిపారు. అయితే, కొన్ని రోజుల తర్వాత తాను ఆ ఫొటోను షేర్ చేశానని... ఆ పిక్ వైరల్ అయిందని చెప్పారు. తన జీవితంలో తాను చేసిన తప్పు అదేనని... అలా చేసినందుకు తాను ఇప్పటికీ బాధ పడుతుంటానని తెలిపారు.
Go Back to Shorts
Rahul Sipligunj
Rajinikanth
Tollywood
Kollywood

More Telugu News